Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News 9 Month Baby Saved Ecmo Treatment Kims Hyderabad

KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..

Published Date :April 21, 2026 , 6:18 pm
By Gogikar Sai Krishna
  • ప్రాణాపాయ స్థితిలో ఎయిర్ లిఫ్ట్ చేసిన శిశువు
  • ARDS, న్యూమోనియాతో తీవ్రమైన పరిస్థితి
  • ECMOతో ప్రాణాలను నిలిపిన వైద్యులు
  • 45 రోజుల పోరాటం తర్వాత కోలుకున్న చిన్నారి
KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైద్య విజ్ఞానం ఎంతగా పురోగమిస్తున్నా, కొన్ని సందర్భాల్లో వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం మాత్రమే ప్రాణాలను నిలబెట్టగలవు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో మృత్యువుకు చేరువైన ఓ తొమ్మిది నెలల శిశువును రాష్ట్రాలు దాటించి ఎయిర్ లిఫ్ట్ చేసి, నెల రోజులకు పైగా పోరాడి పునర్జన్మ ప్రసాదించారు కిమ్స్ వైద్య బృందం.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి మొదట సాధారణ జలుబు, దగ్గు ప్రారంభమయ్యాయి. అయితే వారం రోజుల్లోనే పరిస్థితి విషమించి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ (అడెనోవైరల్ న్యూమోనియా) కారణంగా శ్వాస అందక శిశువు విలవిలలాడింది. రాయపూర్‌లోని స్థానిక ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి చేజారిపోతుందని వైద్యులు గుర్తించారు.

ఈ క్లిష్ట సమయంలో కిమ్స్ కడల్స్ పీడియాట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ బృందం రంగంలోకి దిగింది. నిపుణులైన వైద్యులు రాయపూర్‌కు చేరుకుని, ఆ పసికందును విమాన బృందాల సమన్వయంతో వెంటిలేటర్‌పైనే సురక్షితంగా హైదరాబాద్‌కు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. హైదరాబాద్‌లోని పీడియాట్రిక్ ఐసీయూలో చేర్చిన తర్వాత శిశువుకు తీవ్రమైన ‘ARDS’ తో పాటు ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరే ‘న్యూమోథొరాక్స్’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ (HFOV) వంటి అత్యాధునిక చికిత్సలు అందించినా ఫలితం లేకపోవడంతో, వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

పీడియాట్రిక్ ఐసీయూ హెడ్ డా. పరాగ్ డెకాటే ఆధ్వర్యంలోని బృందం , కార్డియోథొరాసిక్ సర్జన్లు కలిసి శిశువుకు ‘VA ECMO’ చికిత్సను ప్రారంభించారు. ఈ యంత్రం ఊపిరితిత్తులు , గుండె చేయాల్సిన పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. సుమారు 25 రోజుల పాటు ఆ పసికందు ఎక్మో యంత్రంపైనే ఉండి మృత్యువుతో పోరాడింది. ఈ చికిత్సా కాలంలో వైద్య బృందానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అధిక వైరల్ లోడ్, అంతర్గత రక్తస్రావం, రక్తపోటులో మార్పులు వంటి ఆటంకాలను అధిగమిస్తూ వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించారు. క్రమంగా చిన్నారి ఊపిరితిత్తులు కోలుకోవడంతో ఎక్మో , వెంటిలేటర్ నుండి విజయవంతంగా వేరు చేశారు. మొత్తం 45 రోజుల సుదీర్ఘ చికిత్స అనంతరం శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.

PM Modi: వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..!

పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డా. పరాగ్ డెకాటే మాట్లాడుతూ, “ఎక్మో వంటి అత్యాధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడగలుగుతున్నాం. వెంటిలేటర్‌పై ఉన్న శిశువును రాష్ట్రాలు దాటించి తీసుకురావడం , సుదీర్ఘ కాలం ఎక్మోపై ఉంచడం అనేది మా వైద్య బృందం సమష్టి కృషితోనే సాధ్యమైంది” అని తెలిపారు. ఈ అద్భుత విజయంలో పీడియాట్రిక్ ఐసీయూ నిపుణులు డా. కళ్యాణ్ కె, డా. అవినాష్ రెడ్డి పి, డా. వినోద్ కుమార్, డా. మాధురి కె, కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్ , ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డా. రవి తేజ కీలక పాత్ర పోషించారు. మృత్యువు అంచుల దాకా వెళ్లిన తమ బిడ్డను క్షేమంగా తిరిగి ఇచ్చిన కిమ్స్ వైద్యులకు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ARDS Treatment
  • Baby Saved
  • ECMO treatment
  • Health News
  • Hyderabad hospital

తాజావార్తలు

  • KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..

  • Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..

  • Harish Rao : రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు నిప్పులు.. మళ్లీ కాంగ్రెస్ గెలుపు ఒక కల..!

  • IPL 2026: “వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే కంటే ఆ కుర్రాడు చాలా గ్రేట్”.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..

  • Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions