బరువు త్వరగా తగ్గాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. యాపిల్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. డైట్, వ్యాయామాలు ఎన్నిచేసినా.. బరువు తగ్గడం లేదని ఫీలవుతుంటాం. కేవలం ఇవే కాకుండా.. కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి యాపిల్ జ్యూస్. బరువును తగ్గించే యాపిల్ జ్యూస్ ను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ యాపిల్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలంటే?
యాపిల్.. తరిగినది ఒక కప్పు..
గ్రీన్ టీ బ్యాగ్ ఒకటి
అల్లం.. పావుకప్పు
ఆపిల్ సైడర్ వెనిగర్..2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు
ముందుగా గ్రీన్ టీ బ్యాగ్ తీసుకుని 200 మిల్లీలీటర్ల వేడినేటిలో వేసి బాగా నానబెట్టాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకుని అందులో 1 కప్పు మీడియం సైజ్ యాపిల్ కట్ చేసి వేయాలి. దానితోపాటు తురిమిన అల్లం, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత చల్లారిన గ్రీన్ టీ వాటర్ సహా.. అన్ని వేసి బాగా కలపాలి.. వీటన్నింటినీ మిక్సీలో పేస్ట్ లాగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బరువును తగ్గించే జ్యూస్ ను ఫిల్టర్ చేయకుండా ఉదయం, సాయంత్రం తాగాలి. దీనితోపాటు మంచి డైట్ పాటించాలి. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది కాదు.. అలాగే చేపలు, రొయ్యలు, చికెన్ తక్కువగా తీసుకోవచ్చు..
అధిక బరువు ప్రభావం శరీరం పై మాత్రమే కాదు.. మానసిక స్థితి పై కూడా పడుతుంది..ఊపిరితిత్తుల్లో వాయుమార్గాలు సంకోచిస్తాయి. ఇంకా చాలా నష్టాలున్నాయి. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అందుకే శరీరాన్ని ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచుకోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.