చలికాలంలో ఏది తీసుకున్నా జలుబు, దగ్గులు వస్తాయని అందరు అనుకుంటారు.. చలికి బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ సీజన్ లో బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయి విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు A, C, E ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల రక్షణకు అవసరం.. జలుబు నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.. బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని అంటువ్యాధులు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి..
అధిక బరువును తగ్గించడంలో ఇది బెస్ట్ చాయిస్.. ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది..
ఇక వీటిలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, బీటా-క్రిప్టోక్సంతిన్ వంటి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. పెద్దప్రేగు, ప్రోస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి..
బొప్పాయిలో ఉండే పొటాషియం, రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. అంతేకాదు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.. చర్మ సౌందర్యం కోసం కూడా బొప్పాయిని విరివిగా వాడుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
