NTV Telugu Site icon

Health Tips : మునగాకు గురించి నమ్మలేని నిజాలు.. ఆ సమస్యలకు చెక్…

Munagaku

Munagaku

మునక్కాయలను తింటూనే ఉంటారు.. అయితే మునగాకు కూడా పోషకాలను కలిగి ఉంటుంది.. ఎన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మునగాకును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలియని ఎన్నో రహష్యాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు అవేంటో తెలుసుకుందాం..

ఈ మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటితో పాటు క్వెర్సెటివ్, క్లోరోజెనిక్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడింట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించడంలో, కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడతాయి. మునగాకులను తీసుకోవడ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.. క్యాలరీలను బాగా కరిగిస్తుంది.. అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది.. అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు..

అదే విధంగా మునగాకులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకులను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. మునగాకులతో ఇతర ఆకుల వలె పప్పును తయారు చేసుకోవచ్చు. అలాగే కారం పొడిని తయారు చేసుకుని అన్నంతో కలిపి తీసుకోవచ్చు. అలాగే కూరల్లో కరివేపాకును వేసినట్టుగా మునగాకును కూడా వేసుకోవచ్చు.. అలాగే ఈ ఆకుల కషాయాన్ని తాగడం మంచిది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.