జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి కళ్లు.. కళ్లు ఉంటే కాళ్లు చేతులు లేకున్నా బ్రతకొచ్చు అని పెద్దలు అంటుంటారు..కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్ ఏ మాత్రం సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ కళ్లు హెల్తీగా ఉండటానికి మరికొన్ని మిటమిన్లు కూడా అవసరం. ఆ విటమిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అయితే విటమిన్ ఏ.. ఇది కంటిచూపునకు తోడ్పడుతుంది. విటమిన్ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు బీటా కెరోటిన్ శరీరంలోని పేగుల్లో విటమిన్ Aగా మారుతుంది. రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్ A పరిమాణంలో ఉండాలి. బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని ఫలాలు, వెన్న, టమాటాలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది..అందుకే వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది..
కంటి ఆరోగ్యంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సీ.. కళ్లను UV కిరణాల నుంచి రక్షిస్తుంది. విటమిన్ సి శరీరంలోని ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా.. వయస్సు పెరిగే కొద్దీ, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ కళ్లను రక్షించుకోవడానికి సిట్రస్ కమల, బ్రోకలీ, బ్లాక్ బెర్రీలు, ద్రాక్షపండు, జామపండు,యాపిల్ పండ్లను కూడా తీసుకోవాలి..
విటమిన్ ఇ..శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, కళ్ల ప్రొటీన్ నిర్మాణాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ పొందడానికి బాదం, పొద్దుతిరుగుడు, వేరుశనగలు, సోయాబీన్స్ మీ డైట్‌లో ఎక్కువగా తీసుకోండి.. జింక్ కళ్ల ప్రొటీన్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. జింక్ మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెలనిన్ కళ్లను యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. మన శరీరానికి రోజుకు 40-80 mg జింక్ అవసరం. అలాగే బీన్స్, చిక్‌పీస్, నట్స్, తృణధాన్యాలు, గుమ్మడి గింజలు, పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి..అలాగే ఆహారంలో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12లను మీ ఆహారంలో చేర్చుకోండి. తృణధాన్యాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, నట్స్ మీ ఆహారంలో చేర్చుకోండి… ఇవన్నీ ఉంటేనే కళ్లు సురక్షితంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు..