Health Tips: పొట్టలో ఏమీ లేనప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం..అవేంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక రకాల పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. మనలో చాలామంది రోజు ఏదో ఒక పండు ని ఖచ్చితంగా తింటారు. కొందరు ఉదయాన్నే ఏదో ఒక పండు తినడం లేదా మరికొందరేమో ఉపవాసం చేశాక ఖాళీ కడుపుతో ఏదో ఒక పండు తో తమ ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎప్పుడు తింటే ఏంటి? పండ్లే కదా .. ఆరోగ్యానికి మంచివే కదా అని వాటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటాం. అయితే వాటిని ఎప్పడుబడితే అప్పుడు తినకూడదు. వాటిలో షుగర్, కేలరీలు, యాసిడ్లు ఉంటాయి. ఖాళీ పొట్టతో వాటిని తింటే రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదాహరణకు తియ్యటి పండ్లను ఖాళీ పొట్టతో తింటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీని ద్వారా పాంక్రియాస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
కొన్ని రకాల పండ్లైతే పొట్టలోకి వెళ్లాక వాంతులు వచ్చేలా చేస్తాయి. దీని ద్వారా అల్సర్లకు దారి తీసే అవకాశం ఉంది. ఆ తర్వాత టాబ్లెట్లు వాడటం వల్ల సమస్య పరిష్కారమైనా.. అది దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఖాళీ పొట్టతో ఏం తినకూడదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉదయానే ఏమీ తినకుండా ఈ పండ్లను తినకండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
1. అరటిపండు: చాలా మంది ఉదయాన్నే వర్కవుట్ చేస్తూ… ఎనర్జీ కోసం అరటిపండ్లను తింటారు. ఫలితంగా వెంటనే ఎనర్జీ వస్తుంది కానీ… అవి రక్తంలో మెగ్నీషియంను పెంచేసి గుండెకు కీడు చెయ్యగలవు. అందువల్ల ఖాళీ పొట్ట ఉన్నప్పుడు అరటి తినకూడదు.
2. పుల్లటి పండ్లు: పుల్లటి పండ్లు అన్నింటిలోనూ గ్యాస్ ఉంటుంది. ద్రాక్ష, ఉసిరి, ఆరెంజ్ వంటివి. ఇవి పొట్టలోకి వెళ్లి గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గుండె మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం తిన్న తర్వాతే వీటిని తినాలి. అది కూడా కొద్దికొద్దిగానే.
3. పియర్ ఫ్రూట్ : పియర్ ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది. ఖాళీ పొట్టతో ఈ పండును తింటే మూత్రనాళం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
4. లిచి: లిచి పండ్లు తినేటప్పుడు పెద్దగా తియ్యగా ఉన్నట్లు అనిపించవు. కానీ పొట్టలోకి వెళ్లాక మాత్రం షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచేస్తాయి. కడుపు నొప్పి వచ్చేలా కూడా చేస్తాయి.
5. మామిడి పండు: మామిడిని ఉదయాన్నే తినకపోవడం మేలు. ఇందులో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, బాగా తగ్గడం లాంటి సమస్యలు తెస్తాయి.
6. నల్లటి ఖర్జురా: నల్లటి ఖర్జూరాల్లో పెక్టిన్, టాన్నిక్ అనే యాసిడ్లు ఉంటాయి. అవి గ్యాస్ట్రిక్ యాసిడ్‌తో కలుస్తాయి. పొట్టంతా ఉబ్బేలా చేస్తాయి. అందువల్ల ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు. దీర్ఘ కాలికంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు వీటిని తినకూడదు.
7. టమాటా: టమాటాల్లో కూడా టాన్నిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్టలో యాసీడీటీ (acidity)ని పెంచుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్లకు కూడా కారణమవుతుంది.
8. దోసకాయ: దోసకాయల్లో అమైనో యాసిడ్లు ఎక్కువ. వీటిని ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి వచ్చేలా, గుండె మంట కలిగేలా చేస్తాయి.
చూశారు కదా .. ఇకనుండైనా ఖాళీ కడుపుతో ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త వహిస్తే మంచిది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?