NTV Telugu Site icon

Health Tips : గర్భిణీలు రోజూ వీటిని తీసుకుంటే చాలు..అద్భుతమైన ప్రయోజనాలు..

Dry Fruit During Pregnancy

Dry Fruit During Pregnancy

ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచివి..వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వైద్యులు కూడా వీటిని తినమనే సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, అభివృద్ధి చెందుతున్న బిడ్డకు కూడా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము మరియు పొటాషియం ఉంటాయి. ఖర్జూరాలు స్త్రీలకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వీటిలో పొటాషియం ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా, ఖర్జూరం గుండె, జీర్ణాశయం, కండరాల సజావుగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది.

ఖర్జూరంలోని ఫైబర్ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. శరీర బరువును మెయింటైన్ చేస్తుంది..

ఖర్జూరంలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్ కొత్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది మరియు రక్తహీనతను నివారిస్తుంది. ఈ పోషకం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు మరియు మెదడు దెబ్బతినకుండా కూడా నివారిస్తుంది..

ఇందులో విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, గర్భధారణ సమయంలో విటమిన్ కె అవసరం. ఎందుకంటే ఇది పిల్లల ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది…

గర్భధారణ సమయంలో ప్రసవ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల ప్రసవ నొప్పి తగ్గుతుంది. ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని హెల్త్‌లైన్ నివేదికలు చెబుతున్నాయి. దీని కారణంగా గర్భాశయంలో ఫ్లెక్సిబిలిటీ, విస్తరణ ఉంటుంది మరియు ప్రసవ సమయంలో తక్కువ నొప్పిని ఎదుర్కొంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ 6 ఖర్జూరాలు తినే స్త్రీలకు ప్రసవ నొప్పి తగ్గుతుందని పరిశోధనలో తేలింది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.