Site icon NTV Telugu

Health Tips : ఈ టీని రోజుకు ఒక్కసారి తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..

Herbal Tea

Herbal Tea

మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల అనేక రకాల సమస్యలు రావడం కామన్.. అయితే మామూలు టీ తాగడం కన్నా హెర్బల్ టీని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అందులో మనం మందారం తో తయారు చేసిన టీ గురించి తెలుసుకుందాం..

ముందుగా టీ తయారీకి కావలసిన పదార్థాలు..

మందారపువ్వు
అర్జున బెరడు
బెల్లం పొడి
నల్లమిరియాలు
యాలకులు

ఎలా తయారు చెయ్యాలంటే?

1 మందారపువ్వు, 3 గ్రాముల బెరడు పొడి, 1 టీ స్పూన్ నల్లమిరియాల పొడి, 1 గ్రాము శొంఠి పొడి, 1 గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యే వరకూ మరిగించి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవడం మంచిది..దీనిని 12 వారాల పాటు తాగితే కచ్చితంగా బీపి లాంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు…

ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

ఈ మందారపువ్వుని వాడడం వల్ల షుగర్, ఆందళన, తలనొప్పి, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడం, హార్మోన్ల సమస్యలు, హైబీపి, స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తుంది.. బాడీలోని కఫ, పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. మందార పువ్వు మీ మనస్సుని ప్రశాంత పరుస్తుంది. మీ మనస్సుని తేలిగ్గా చేస్తుంది.మందారపువ్వుల్లో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి బాడీలోని కఫ, పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. మందార పువ్వు మీ మనస్సుని ప్రశాంత పరుస్తుంది.. మనస్సును హాయిగా తేలిగ్గా ఉంచేలా చేస్తుంది.. ఇంకా జుట్టు సమస్యలు కూడా తగ్గిపోతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version