Site icon NTV Telugu

Health Tips : టమోటా జ్యూస్ ను ఇలా తీసుకుంటే.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది..

Tamota Juice

Tamota Juice

అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. ఆహారపు అలవాట్లు మారడం వల్ల లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోంది. అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు సమస్యలతో బాధపడుతున్నారు.. ఈ మధ్య గుండె పోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మనం నిత్యం అనేక సమస్యలు రావడం చూస్తూనే ఉన్నాం.. టమోటాతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక కొవ్వు అనేది ఒక రకమైన జిగట పదార్థం.. రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై శ్రద్ధ వహించాలి. అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్ ఒక వ్యక్తికి చాలా కాలం పాటు ప్రాణాంతకం.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా గుండె బారిన పడుతున్నారు..

పోషకాలు అధికంగా ఉండే కూరగాయలలో ఎర్ర టొమాటో ఒకటి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కాకుండా విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. టొమాటో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల నరాల ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.. చెడు కొలెస్ట్రాల్ ను కూడా వెంటనే తగ్గిస్తుంది.. జ్యూస్ తాగడం గుండెకు మాత్రమే కాదు. ఇది చర్మంపై మెరుపును పెంచడమే కాకుండా కంటి చూపును పదును పెడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం బరువును నియంత్రిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version