మొక్క జొన్న ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్షాకాలంలో దర్శనమిచ్చే ఈ మొక్క జొన్నల రుచే వేరు. ఉడికించుకొని, కాల్చుకొని, గ్యారెలు, పకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. అయితే సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని అనుకుంటాం.. కానీ కండిని తీసుకోవడం కన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..
మొక్క జొన్న పీచులో పీచుతో టీ తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న పీచులో విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పీచుతో తయారు చేసే టీని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మొక్కజొన్న పీచుతో టీని ఎలా తయారు చేసుకోవాలి.. ఎప్పుడూ తాగాలి.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొక్కజొన్న పొట్టును తీసేసిన తర్వాత పీచును సేకరించాలి. అనంతరం ఒకసారి మంచి నీటితో పీచును కడిగేసి ఒక పాత్రలో తీసుకోవాలి. అనంతరం అందులో రెండు గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత టీని వడకట్టాలి. చివరిగా వచ్చే టీని తాగేయాలి. ఒకవేళ చేదుగా అనిపిస్తే టీలో తేనె వేసుకొని తాగొచ్చు.. చక్కరను అస్సలు వేసుకోకండి..
బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మగవారిలో ప్రొస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష వ్యర్థాలను బయటకి పంపిస్తుంది. పీచులో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ రోగులకు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సుఇలన్ హార్మోన్ అందిస్తుంది. ఇక షుగర్ పేషెంట్స్‌కి సైతం ఈ టీ మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పీచుతో చేసిన టీ ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ రేటు మెరుగవుతుంది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగించేస్తుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చూడడంలో ఈ పీచు టీ ఉపయోగపడుతుంది. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఈ టీని తీసుకుంటే, అది కూడా ఉదయం తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.