NTV Telugu Site icon

Health Tips : ఈ జ్యూస్ ను పరగడుపున తాగితే.. ఆ సమస్యలు మాయం..

Coriander Juice

Coriander Juice

కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వంటల్లో సువాసనలు, అందంగా ఉండేందుకు ఎక్కువగా వాడతారు.. కొత్తిమీర చట్నీ, కొత్తిమీర రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే వంటల్లో వాడడానికి బదులుగా దీనిని జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. మరి కొత్తిమీరను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్తిమీరను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ జ్యూస్ ను తాగడం వల్ల గాయాలు, దెబ్బలు త్వరగా మానుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర జ్యూస్ ను తాగడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.. అంతేకాదు గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది..

కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే కొత్తిమీరతో జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ జ్యూస్ ను పరగడుపున తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.