NTV Telugu Site icon

Health Tips : రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే చాలు.. హాయిగా నిద్రపోతారు..

Slp

Slp

ఈరోజుల్లో జనాలకు డబ్బులు మీద పిచ్చితో కడుపు నిండా తినడం, నిద్రపోవడం అనేది టైం కు చెయ్యడం లేదు.. దాంతో నిద్రలేమి సమస్యలు రావడంతో పాటుగా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.టీవీ చూడడం లేదా ఫోన్ తో కలాక్షేపం చేయడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కలత నిద్ర మాత్రమే వస్తుంది. సుఖంగా నిద్రపోలేదు. అయితే హాయిగా నిద్రపోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిని పాటించడం ద్వారా ఎలాంటి ఆందోళనలు లేకుండా నిద్రపోగలుగుతారు.. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొందరికి సంగీతం అంటే చాలా ఇష్టం. కానీ అది వినేంత సమయం ఉండదు. అయితే పడుకునే 5 నిమిషాల మందు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మనసు ఉల్లాసంగా మారుతుంది. దీంతో ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. ఉదయం లేచిన తరువాత కూడా యాక్టివ్ గా ఉంటారు..

మీరు పడుకొనే ముందు 3 నిమిషాల పాటు శ్వాస పీలుస్తూ వదలండి. ఇలా చేయడం ద్వారా అప్పటి వరకు ఎన్ని ఆందోళనలు ఉన్నా వాటిని మరిచిపోగలుగుతారు. అంతేకాకుండా ఇలా ప్రతి రోజు చేయడం వల్ల కానసంట్రేషన్ పెరుగుతుంది.. చెడు ఆలోచనలు దూరం అవుతాయి.. దాంతో హాయిగా నిద్రపోతారు..

మీ కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి. అవసరమైతే వారితో జోకులు వేయండి. పిల్లలతో ఆడుకోండి. అలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ గా మారుతుంది. దీంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోతారు..

పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి కథల పుస్తకం చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. దీంతో ఇష్టమైన బుక్ ను ప్రతి రాత్రి పడుకునే ముందు చదువుకునే అలవాటు చేసుకోండి.. ఇది చాలా మంచి అలవాటు..నాలెడ్జ్ పెరగడంతో పాటుగా హాయిగా నిద్రపోతారు..

పోషకాలు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవడం అస్సలు మర్చిపోకండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.