NTV Telugu Site icon

Health Tips: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..

Disposablecups

Disposablecups

ఒకప్పుడు మట్టి గ్లాసుల్లో తాగేవారు.. ఆ తర్వాత తాగి, స్టీల్ గ్లాసుల్లో నీళ్లను తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది గురు.. అందరు డిస్పోజబుల్ కప్పులను గ్లాసులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. వీటిని వాడటం వల్ల ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఒక్కసారి వాడి పడేసే వీటి ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పెద్ద రెస్టారెంట్లలో ఈ కప్పుల్లో మాత్రమే అందిస్తారు. టీ కూడా డిస్పోజబుల్ కప్పుల్లో మాత్రమే తాగుతారు. అయితే డిస్పోజబుల్ కప్పులను ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డిస్పోజబుల్ కప్పుల తయారీలో ప్లాస్టిక్, రసాయనాలు వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల ప్రాణాంతకరమైన క్యాన్సర్‌ను ఆహ్వానించినట్లేనని అంటున్నారు…

ఎందుకంటే వీటిలో ఎక్కువగా బిస్ ఫినాల్, బీపీఏ రసాయనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఈ కప్పుల్లో టీ లేదా వేడినీరు తాగినప్పుడు కప్పులో ఉండే రసాయనాలు వాటిలో కరిగిపోతాయి. మనం టీ లేదా నీరు తాగినప్పుడు ఈ రసాయనాలు కడుపులోకి ప్రవేశించి క్యాన్సర్‌కు కారణమవుతాయి. డిస్పోజబుల్ కప్పుల్లో టీ, వేడినీరు తాగడం వల్ల చాలా హాని జరుగుతుందని క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కుమార్ చెప్తున్నారు.. ఈ ప్లాస్టిక్ రసాయనం ద్వారా థైరాయిడ్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందట.. అంతేకాదు వీటిని తరచు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. టీ లేదా ఇతర పానీయాలను తాగేందుకు స్టీల్ గ్లాసులు లేదా మట్టి గ్లాసులను వాడటం ఉత్తమం అని చెబుతున్నారు.. సో ఇక ఎక్కడకు వెళ్లినా ఇదే పని చెయ్యండి లేకుంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.