Site icon NTV Telugu

Health Tips :వర్షాకాలంలో ఉదయాన్నే ఈ టీ తాగండి.. ఎటువంటి రోగాలు దరిచేరవు..

Ginger

Ginger

చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ లో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆలాగే అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.అదే విధంగా డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే అల్లం టీని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అల్లం టీ ఎక్కువగా తాగితే గుండెల్లో మంట,విరేచనాలు, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీలో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి.

అల్లం టీ ఎక్కువగా తాగటం వలన డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అల్లం టీ తక్కువ పరిమాణంలో తీసుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకాన్ని కలిగిస్తుంది.. కొన్ని మందులు వాడేవారు అల్లం టీని ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ మోతాదులో తీసుకుంటే అల్లం టీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి రక్త స్రావాన్ని కలిగిస్తాయి. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా అల్లం టీ తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మోతాదు మించితే అనర్ధమే కదా.. అందుకే ఏదైనా లిమిట్ గా తీసుకోవడం మంచిది.. వర్షాలు గ్యాప్ లేకుండా కురుస్తున్నాయి.. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version