సాధారణంగా కాయకూరలను వండుకొని తినేముందు తొక్కలను తీసేస్తుంటాం.. బీరకాయ వంటి కాయగూరైతే తొక్కల తో పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం అందులో నుంచి వచ్చే రసానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం. చాలా మంది పులుపు కోసం ఈ రసాన్ని వాడుతారు.. నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
మన రోజువారీ ఆరోగ్యం నిమ్మరసం ఎంత ముఖ్యమైన భాగమో, నిమ్మ తొక్కలు కూడా అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా నిమ్మకాయ తొక్క పోషక లక్షణాలతో నిండి ఉంటుంది… నిమ్మకాయ రుచి, ఆరోగ్యం ఉంటుందన్న విషయం తెలిసిందే.. అలాగే నిమ్మకాయ తొక్కల వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
*. నిమ్మ తొక్కలు, విటమిన్ సి తో నిండి, సాధారణ వ్యాధుల తో పోరాడటానికి మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
*. నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
*. నిమ్మ తొక్కలు యాంటీ బాక్టీరియల్ భాగాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
*. ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది..
*. బరువును కూడా తగ్గించడం లో చాలా బాగా పనిచేస్తుంది..
*. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఇక నిమ్మకాయ తొక్కలతో టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మాంసాహార తయారీలు, డెజర్ట్‌లు, కాక్‌టెయిల్ లు, ఇంట్లో తయారుచేసిన మసాలా మిశ్రమాల లో కూడా ఎండిన మరియు పొడి నిమ్మకాయ తొక్కను ఒక మూలవస్తువుగా చేర్చవచ్చు. మీరు మీ డిష్‌లో నిమ్మకాయ రుచిని కలిగి ఉండాలనుకుంటే. సాధారణ మసాలా వంటి పొడిని జోడించండి.. ఇలాంటి ఎన్నో వంటలలో కూడా వాడుతుంటారు.. అందానికి కూడా బాగా పనిచేస్తాయి.. అందుకే ప్రతి కూరగాయ తొక్క కూడా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి..
