NTV Telugu Site icon

Health Tips : మటన్ తింటే ఆ వ్యాధి వస్తుందా? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Mutton

Mutton

ఈరోజుల్లో ఎక్కువ మంది షుగర్ బీపి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలుసు.. మనిషిని లోలోపల కొరుక్కొని తినేస్తుంది.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే షుగర్ వచ్చిన వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా ఆలోచిస్తారు.. అయితే మటన్ తింటే షుగర్ పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి రావడం పక్కా.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చెడు కొలెస్టరాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. చెడు కొలెస్టరాల్ అంటే ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్. ఇవి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ల శరీరంలో ఎంత తక్కువగా పేరుకుపోతే అంత మంచిది.. ఒంట్లో కొవ్వు శాతం అధికంగా ఉండే వారు మటన్ ను తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు.. రెడ్ మీట్, పొట్టేలు మాంసం, మేక మాంసాన్ని తగ్గించాలి.

షుగర్ ఉన్నవాళ్లు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి కానీ,కొవ్వు ఉండకూడదు. మటన్ లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచుతుంది.. అందుకే మటన్ తినాలని అనుకుంటే మాత్రం చాలా రోజులు గ్యాప్ తీసుకొని తినడం మంచిది.. ఇది తప్పక గుర్తుంచుకోవాలి..

 

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.