చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాలి.. జలుబు, దగ్గు నుంచి అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.. అందులో దంత సమస్యలు కూడా ఉన్నాయి.. స్వీట్ తిన్న లేదంటే హాట్ వాటర్ చల్లని నీరు తాగినా కూడా వెంటనే నోట్లో పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. చిగుళ్ల నొప్పి అనేవి కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం చలికాలంలో చల్లటి వాతావరణంలో దంతాలు చిగుళ్లు సున్నితంగా మారడమే.. దంత సమస్యలకు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం..
ఇలా పంటి సమస్యలు రావడానికి కారణం మనం వాడే పేస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తెల్లగా కావాలని టూత్ పేస్ట్ ఎక్కువగా వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు బ్రష్ చేస్తుంటారు. అంత ఎక్కువ సేపు బ్రష్ చేయడం వలన పంటి పై ఉండే ఎనామిల్ పోయి పళ్ళు సెన్సిటీవ్‌గా తయారవుతాయి. అలాంటి సమయంలో ఎక్కువగా పళ్ళు సున్నితంగా మారతాయి పంటి నరాలు లాగుతునట్లు అనిపించడం వంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు భరించలేని నొప్పి చిగుర్లు వాపు రావడం వంటివి కూడా జరుగుతాయి..
సాల్ట్ వాటర్ పళ్ళు నొప్పిగా అనిపించినప్పుడు కానీ జివ్వుమని లాగినప్పుడు కొన్ని గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. రెండోది వెల్లుల్లి. వెల్లులిలో ఉండే అలిసిన్ అనే ఔషధం పంటి నొప్పిని తొందరగా తగ్గిచేస్తుంది. మూడవది లవంగం.. వీటితో వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.. నొప్పి రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. రెండవది పేస్ట్ ఎక్కువగా కాకుండా తగినంత వాడాలి… మంచి పేస్ట్ లను వాడటం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
