NTV Telugu Site icon

Health Tips : ముల్లంగిని ఇలా తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

Radish

Radish

ముల్లంగిని సాంబార్, సలాడ్స్ లలో ఎక్కువగా తీసుకుంటారు.. ఎన్నో తెలియని రోగాలను నయం చేస్తుంది.. దగ్గును తగ్గిస్తుంది.. అయితే ముల్లంగిని నేరుగా తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు.. అయితే ముల్లంగిని ఎండబెట్టి, దాని పొడిని తయారు చేయండి. దీన్ని ఒక గ్రాము చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయాని నిపుణులు అంటున్నారు.. అసలు ముల్లంగిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొద్దిగా ముల్లంగి రాసాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే పచ్చి ముల్లంగిని తినండి. మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు.

ముల్లంగిలో పప్పు కలిపి తింటే ఆరోగ్యానికి హానికరం. మీకు గొంతు నొప్పి, శరీరంలో నొప్పి, వాపు ఉంటే అది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే దీనిని తినవద్దు..

ముల్లంగి రెండు ఇంచులు తీసుకొని ముక్కలుగా చేసి రోజు పరగడుపున తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

కామెర్లు సమస్య నుండి బయటపడాలంటే ముల్లంగి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం, ముల్లంగి తాజా ఆకులను మెత్తగా, అలాగే దానిలో పేస్ట్ చేయండి. తర్వాత పాలలో వేసి మరిగించాలి. నురుగు రాగానే మరిగించి తాగాలి. ముల్లంగిని ఎప్పుడూ చేపలతో కలిపి తినకూడదు.. ముల్లంగి సాంబార్ లలో, కర్రీలలో వేస్తారు.. కొంచెం చేదుగా అనిపించినా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.