చలికాలంలో ఎన్నో వ్యాధులు పలకరిస్తాయి.. మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. చలికాలంలో తేనెను వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. తేనె వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ తేనె తో ఎండు ద్రాక్షలను కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎండుద్రాక్ష, తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
తేనె, ఎండు ద్రాక్షాలను కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు తీసుకుంటే ఆ సమస్య వెంటనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఒక గాజు సీసాలో తేనెను, ద్రాక్షలను కలిపి ఉంచాలి.. రెండు రోజులు కదపకుండా అలా వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. వీటిని తీసుకోవటానికి ముందు,తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు..
ఇకపోతే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. బరువును అదుపులో ఉంచుతుంది.. మలబద్ధకం సమస్యను మెరుగుపరచడంతో పాటు, జీర్ణక్రియ బాగా జరిగేలా ప్రోత్సహిస్తుంది.. గుండె సమస్యలను కూడా వెంటనే తగ్గిస్తుంది.. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఇది చాలా సహాయపడుతుంది.. చలికాలంలో శరీరాన్ని డీహైడ్రెడ్ గా ఉంచుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకసారి ట్రై చేసి చూడండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
