Site icon NTV Telugu

Health Tips: చలికాలంలో మిరియాలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Miriyalu

Miriyalu

చలికాలంలో దగ్గు, జలుబు రావడం కామన్.. వీటికి ఇంగ్లిష్ మందులను వాడిన కొంతవరకు ఉపశమనం పొందుతారు.. కానీ మళ్లీ అదే విధంగా జలుబు, దగ్గు ఉంటాయి.. ఇలాంటి వాటికి ఇంట్లో దొరికే మిరియాలను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో మిరియాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నల్ల మిరియాలు నల్ల బంగారం అని కూడా అంటారు. నల్ల మిరియాలలో చాలా ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నందున, ఇది విలువైన పదార్థంగా పరిగణించబడుతుంది. నల్ల మిరియాలు అనేక ఆర్యువేద ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అందుకే నల్ల మిరియాలను ఔషధ గుణాలున్న బ్లాక్ గోల్డ్ అంటారు..

ఇవి బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.. మీరు బరువు తగ్గాలని మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, నల్ల మిరియాలు సులభమైన మార్గం.. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి..

మిరియాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలను కూడా కలిగి ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉపయోగించడం యాన్సర్‌ను నివారించవచ్చు మరియు రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలు ఉపయోగించడం వల్ల అనేక రకాల క్యాన్సర్ కణాలు శరీర అవయవాలపై ప్రభావం చూపకుండా నిరోధిస్తుంది..

మీరు ఆహారంలో నల్ల మిరియాలు జోడించడం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియ సులభం అవుతుంది. కొన్ని ఆహారాలు అజీర్తిని కలిగిస్తాయి, మీరు దీనిని నివారించాలనుకుంటే, నల్ల మిరియాలు ఉపయోగించడం చాలా మంచిది..

అంతేకాదు ఈ మిరియాలు రక్తానికి సరైన మొత్తంలో చక్కెర స్థాయి అవసరం. కానీ మన ఆహారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఈ చక్కెర శాతం తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. కానీ బ్లాక్ పెప్పర్ గ్లూకోజ్ మెటబాలిజం బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే మధుమేహం ఉన్నవారు నల్ల మిరియాలు కలిపిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు..

నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల చర్మ రక్షణకు సహాయపడుతుంది. మొటిమలు, కాలానుగుణ అలెర్జీలు, ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version