NTV Telugu Site icon

Health Tips : నానబెట్టిన పల్లీలను తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Soaked Palli

Soaked Palli

పల్లీలు చాలా రుచిగా ఉంటాయి.. అందుకే రకరకాలుగా వీటిని తినడానికి ఇష్టపడతారు.. నిజానికి వీటిలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్‌, ఐరన్‌, సెలీనియం, జింక్‌, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి… మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. ఇక పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పల్లీలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

*. నానబెట్టిన వేరుశెనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు..
*.రోజూ ఉదయం తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్‌పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి రిలీఫ్ ఇస్తుంది.
*. పల్లీలలో ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కంటి చూపును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి..
*. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా అనేక రకాల రోగాల నుంచి విముక్తి కలుగుతుంది..
*. ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు..ఇవే కాదు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.