లవంగాలు మన పోపుల డబ్బాల ఉంటుంది.. వంటల్లో ఘాటును, రుచిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ..
ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్-సి, రిబోప్లావిన్, థయామిన్, విటమిన్-బి కాంప్లెక్స్ లతో సహా ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. పరగడుపున ఒక లవంగాన్ని తింటే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోవడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తొలగిపోయి మౌత్ రిఫ్రెషనర్ గా పనిచేస్తుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల మీద పోరాటం చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
గొప్ప యాన్తి యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది. లవంగం పరగడుపున తింటే పళ్ళు, చిగుళ్ళు దృడంగా మారతాయి. ఇకపోతే లవంగాల లో యూజీనాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది సైనస్ వంటి సమస్యలను తొలగించటానికి సహాయపడుతుంది. ప్రస్తుతం సీజన్ మారింది. ఈ సీజన్లో సైనస్ సమస్య కూడా వస్తూ ఉంటుంది.. దానికి చెక్ పెట్టేందుకు లవంగం ఉపయోగ పడుతుంది.. అలాగే బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.