Health Tips : వాము వాటర్ ను పరగడుపున ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వామును ఎన్నో రకాలుగా వాడుతుంటారు.. బజ్జీ, స్నాక్స్ లలో ఎక్కువగా వాడతారు.. స్పైసి గా ఉండే స్నాక్స్ లలో వామును వాడుతారు.. చిటికెడు వాము వేయాల్సిందే. వాము ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆహారానికి రుచి, వాసన ఇవ్వడంతోపాటు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామును కడుపు నొప్పి తగ్గించడానికి హోంరెమిడీలోనూ ఉపయోగిస్తారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వాము నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.. వాములో గ్యాస్ట్రిక్ యాసిడ్, జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లు ఉన్నాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. జీర్ణక్రియకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాము నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. విరోచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది..
Also Read
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వాము వాటర్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని ఎలుకలపై చేసిన ఓ అధ్యయనంలో కనుగొన్నారు. వాము వాటర్ తాగితే గుండెకు మేలు చేసే.. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగతుంది. వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. కొంచెం వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ పరగడుపున తాగితే గుండె జబ్బులు కూడా దరి చేరవని నిపుణులు చెబుతున్నారు..
వాము ఊపిరితిత్తులు మెరుగ్గ పని చేయడానికి సహాయపడుతుంది. ఈ కాలంలో ఎక్కువ మంది జలుబుతో బాధపడతారు. జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనంగా ఉంటుంది.వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్.. మొదలైన గుణాల వల్ల దగ్గు నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది..
శరీరంలో కొవ్వును కరిగించడానికి వాము వాటర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. స్థూలకాయం, అధిక బరువు సమస్యతో బాధపడేవారు వారి డైట్‌లో వాము చేర్చుకోండి..నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు రోజూ కాస్త ఈ వాము వాటర్ ను తీసుకొని ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!