NTV Telugu Site icon

Health Tips: తరుచుగా తలనొప్పి వస్తుందా? అయితే ఇలా చేయండి..

6 Ways To Get Rid Of A Headache Without Popping A Pill See Here 2

6 Ways To Get Rid Of A Headache Without Popping A Pill See Here 2

ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి వస్తుంది. అయితే కొన్ని పద్దతులు పాటిస్తే తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిట్కాలు:

1. ఆవు పాలు వేడి చేసి తాగితే తలనొప్పి తగ్గుతుంది.
2. తలనొప్పి తరచూ వేధిస్తుంటే భోజనంలో నెయ్యి వేసుకొని తింటే ఫలితం ఉంటుంది.
3. తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్దన చేసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంది.
4. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది.
5. కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా తగ్గిపోతుంది.