రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక వరంలాంటిదే.నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. అయితే త్వరగా నిద్ర పట్టే చిట్కాలు ఏమిటో చూద్దాం..
చిట్కాలు:
1. నిద్రపోయే ముందు మీ బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా.. ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
2. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి .
3. సాయుంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకుండా ఉంటే మంచిది.
4. ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపోవాలి. పగలు చిన్నకునుకు చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పగటి వెలుగులో గడపాలి.
5. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.
6. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం, టీవీ చూడటం వంటివి చేయవద్దు.
7. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు.