NTV Telugu Site icon

Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..

Transparent,vase,with,strawberries,outdoors.,strawberries,in,summer.,strawberries,on

Transparent,vase,with,strawberries,outdoors.,strawberries,in,summer.,strawberries,on

స్ట్రాబెర్రీలు రుచికి పుల్లగా ఉన్నా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా మంది పెరిగిపోతున్నారు.. అయితే స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.. ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.. ఈ స్ట్రాబెర్రీలతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

*. దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిలో ఎంజైములు ఏర్పడకుండా చేస్తుంది.

*. ఇందులో పొటాషియం అనేది అధిక సంఖ్యలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

*. స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో పాలీఫెనాల్స్ సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి..
*. క్యాన్సర్ నివారణ లక్షణాలు స్ట్రాబెర్రీలలో ఉన్నాయి. ఇది క్యాన్సర్‌ను నిరోధించడంలో మీకు సహాయపడుతుంది..
*. వీటిలో ఫైబర్‌తో పాటు అనేక విధాలుగా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో నీరు కూడా ఉంటుంది..
*. స్ట్రాబెర్రీలను సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా వాటిని అల్పాహారం సమయంలో కార్న్‌ఫ్లేక్స్ లేదా ఓట్స్‌లో కూడా చేర్చవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ పండును నేరుగా తినవచ్చు. కొంతమంది షేక్స్ లేదా స్మూతీస్ తయారు చేసి తింటారు.. చక్కరతో అస్సలు తీసుకోకండి.. చాలా ప్రమాదం..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments