ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తాగే పానీయాలలో బ్లాక్ ముందు వరుసలో ఉంటుంది. బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే 10 ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. బ్లాక్‌టీ లో యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ఉంటాయి. దీని వలన శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతో పాటు.. పక్షవాతం రాకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి బ్లాక్ టీ సహాయపడుతుంది. అధికరక్తపోటు, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల డయాస్టొలిక్ స్థాయిలో నియంత్రణలో ఉండి రక్తపోటు సమస్య రాకుండా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు బ్లాక్ టీ అనేది ఇన్సిలిన్ వాడకాన్ని మెరుగుపరిచే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
దీని ద్వారా షుగర్ సమస్యలు రాకుండా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వ్యవస్థలో నిరోధించి క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించడంలో బ్లాక్ టీ సహాయపడుతుంది. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ నయం కానప్పటికీ క్యాన్సర్ కణాలతో పోరాటానికి సహాయపడుతుంది. మన శరీరంలోని వైరస్ బాక్టీరియాను బయటకు పంపడంలో బ్లాక్ టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగిన కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. రోజు బ్లాక్ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీళ్ళు ఉంటుంది.
సీజన్ వ్యాధులను అరికట్టడంలోనూ బ్లాక్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బ్లాక్ టీని మామూలుగా మాదిరిగానే తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో బ్లాక్ టీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. నీటిని బాగా మరిగించి అందులో బ్లాక్ టీ బ్యాగ్స్ వేసుకుంటే సరి. కొన్ని నిమిషాల తర్వాత దీనికి అల్లం, నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.