NTV Telugu Site icon

Health Tips : రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి..

Walking

Walking

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. దాంతో బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్‌ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. చాలా తేలికైన, చవకైన.. అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం. నడవటానికి ఎలాంటి సాధనలు అవసరం లేదు, మనకు వీలు చిక్కినప్పుడు కొంతసేపు వాకింగ్‌ చేయవచ్చు. బరువు తగ్గాలనుకునేవారి ఫస్ట్‌ ఆప్షన్‌ కూడా ఇదే అని చెప్పొచ్చు.. బరువు తగ్గడానికి వాకింగ్ చేసేవాళ్ళు ఈ పొరపాట్లు గురించి తప్పక తెలుసుకోవాలి..

మీరు బరువు తగ్గాలనుకుంటే.. వాకింగ్‌‌తో పాటు వేరే వ్యాయామాల పైనా దృష్టిపెట్టండి. ఇలా చేస్తే రోజూ వారీ ఎక్కువ కేలరీలను బర్న్‌ చేయవచ్చు. ఏరోబిక్స్‌, యోగా వంటివి ప్రాక్టిస్‌ చేయండి..

తక్కువ ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని అనుకుంటారు.. కానీ అందులో నిజం లేదు..బరువు తగ్గాలనుకునేవారు.. పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడటంతోపాటు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవాలి..

రోజంతా ఎక్కువగా నీరు తాగాలి. శరీరం హైడ్రేట్‌గా ఉంటే.. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. మీ డైట్‌లో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి..వాకింగ్‌ చేస్తున్నారని ఎక్కువగా తింటే.. ఏమి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే, బరువు తగ్గడానికి బదులుగా, పెరిగే అవకాశం ఉంది..

అలాగే వాకింగ్‌ చేస్తున్నారని ఎక్కువగా తింటే.. ఏమి ఉపయోగం ఉండదు. ఇలా చేస్తే, బరువు తగ్గడానికి బదులుగా, పెరిగే అవకాశం ఉంది.. రోజూ 7 నుంచి 9 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని లక్ష్యం పెట్టుకోండి. నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇది మీ వెయిట్‌ లాస్‌ జర్నీకి అడ్డుపడొచ్చు..

బరువు తగ్గుతారని అనుకుంటూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. అతేకాదు, కొందరు క్రాష్‌ డైట్‌లను ఫాలో అవుతూ ఉంటారు. ఇవి కూడా అనారోగ్యాలకు కారణంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.. వ్యాయామం చేస్తున్నామని కొందరు అతిగా తింటుంటారు. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం.. షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలను అస్సలు తీసుకోకండి.. ఇవన్నీ ఫాలో అయితే సులువుగా బరువును తగ్గుతారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments