బోండాలు, బజ్జీలు, పూరీలు వేసుకోవాలంటే ఖచ్చితంగా నూనె ఉండాలి.. వాటికి మంచి రుచి రావాలంటే నూనెలో కాల్చాల్సిందే.. మనం ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటేనే నూనెను ఎలాగో వాడేస్తాం.. అదే బయట జంక్ ఫుడ్ చేసేవాళ్లు అయితే చెప్పనక్కర్లేదు రోజూ అదే పనిమీద ఉంటారు.. ముఖ్యంగా కబాబ్, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలకు ఎక్కువగా ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉంటాం.. ఇలాంటి చేస్తే మన ప్రాణాలను మనమే తీసుకున్నట్లు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
వాడిన నూనెను మళ్ళీ వాడితే ఫ్రీ రాడికల్స్ ను పెంచుతూ ఉంటాయి. ఇవి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తాయి. వీటి వలన బ్లాక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాడిన నూనెను తిరిగి వాడితే ఆహారం విషంగా మారుతుంది. దాంతో కడుపులో మంట, కడుపులో నొప్పి లాంటివి వస్తాయి.. ఒకసారి వాడితే ఎలా అయితే పోషకాలు అందుతాయో.. అలాగే మళ్లీ మళ్లీ కాచిన నూనెను వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెబుతున్నారు..
ఇలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.. బయట దొరికే ప్రాసెస్ ఫుడ్ ని కూడా తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే బయట ప్రతిరోజు అదే ఆయిల్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉపయోగించే ఆయిల్ తో పోల్చుకుంటే బయట ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. అందుకే వీలైనంత వరకు ఆయిల్ ను తక్కువగా వాడుకోవాలి.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఆయిల్ ను వాడటం మంచిది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
