ఎన్ని రకాల పిండి వంటలను తిన్నా చివరిలో పెరుగు తినకుంటే మాత్రం అస్సలు తిన్నట్లు కూడా ఉండదు.. పెరుగులో అనేక పోషకాలు కూడా ఉంటాయి.. ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. చాలా మంది మధ్యాహ్న భోజనంతో తినడానికి ఇష్టపడతారు. కానీ కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినడానికి ఇష్టపడతారు..పెరుగు తినడం ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. అయితే రోజూ పెరుగు తినడం మంచిదేనా అనే సందేహలు కూడా రావడం సహజం. మీ ఆరోగ్యం సాధారణంగా ఉన్నంత వరకు, మీరు పరిమిత మోతాదులో పెరుగు తింటే, అది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు.. జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినడం మంచిది కాదు.. పెరుగును తీసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కండరాలు, చర్మం, జుట్టు, గోర్లు మొదలైనవి ప్రోటీన్‌తో తయారు చేయబడ్డాయి. అందువల్ల, ప్రతిరోజూ ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం.. పెరుగులోని ప్రోబయోటిక్స్ అనేది మన గట్‌లోని ప్రత్యక్ష బ్యాక్టీరియా, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, పోషకాలను వెలికితీయడంలో సహాయపడుతుంది. పెరుగు ఈ మంచి బ్యాక్టీరియా సంఖ్యను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..
మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు వేడి మొదలైన వాటిని నివారించవచ్చు. అలాగే, ఎముకలకు కాల్షియం అవసరం. కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.. ఇక బి 12 మెదడుకు, రక్తనికి చాలా అవసరం.. విటమిన్ చాలా తక్కువ ఆహారాలలో లభిస్తుంది. అందుకే చాలా మందిలో విటమిన్ B12 లోపం ఉంటుంది. పాలతో తయారైన పెరుగు తినడం వల్ల లభిస్తుంది.. దీనివల్ల అలసట, నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..అది కూడా లిమిట్ గా తీసుకుంటే మరీ మంచిది లేకుంటే మాత్రం ప్రమాదమే..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.