NTV Telugu Site icon

Health Tips : కివీ పండ్లను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..

Kiwi

Kiwi

కివీ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది.. అందుకే డాక్టర్లు కూడా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడానికి కాస్త పుల్లగా తియ్యగా కూడా ఉంటాయి..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కీవీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకుంటే అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు..

కివీలో ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.. ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలర్జీ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనివల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, నోటి లోపల చికాకు, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ రోగులు కివి పండ్లను ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు.. వీటిలో పోటాషియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది..

ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా పెదవులు, నాలుక వాపు, నోటి లోపల పుండ్లు లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కీవీ పండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డయోరియా సమస్యలు రావచ్చు.. అంతేకాదు కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments