NTV Telugu Site icon

Health Tips : రోజుకు రెండు సార్లు టీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే…

Tea (2)

Tea (2)

రోజూ టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.. ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే టీని ఒక్కసారి తాగితే మంచిదని, అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మన దేశంలో టీకి ఎక్కువ డిమాండ్ ఉంది.. పొద్దున లేవగానే చాయ్ తాగడానికి ప్రయత్నాలు చేస్తారు. పొద్దున ఒకసారి… 10 గంటల సమయంలో మరొకసారి… సాయంత్రం మరో రెండు సార్లు చాయ్ లు తాగుతారు.. రోజుకు రెండు మూడు సార్లు టీ తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

ఒకసారి కంటే ఎక్కువ సార్లు టీ తాగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఒత్తిడి మరియు ఆందోళన పెరుగుతుందట. ముఖ్యంగా ఆకలి పూర్తిగా చచ్చిపోతుంది.. దాంతో జీర్ణ సమస్యలు రావడంతో పాటుగా గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.. అలాగే మలబద్ధక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా అసలు టీ ముట్టకూడదట. కీళ్ల నొప్పుల నుంచి… గొంతు నొప్పుల వరకు అన్ని వ్యాధులు ఈ చాయ్ వల్ల వస్తాయి.. షుగర్ ఉన్న వాళ్లు టీ తాగడం మంచిది కాదు.. అందుకే రోజుకు ఒక్కసారి మాత్రమే టీ తాగితే మంచిదని హెచ్చరిస్తున్నారు.. టీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.