Site icon NTV Telugu

Health Tips: ఉసిరితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..

Amla

Amla

ఉసిరికాయ గురించి తెలియని వాళ్లు ఉండరు.. తినని వాళ్లు కూడా ఉంటారా.. వీటిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది..ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది.. ముఖ్యంగా జుట్టు సంరక్షణ లో ఉసిరిని బేషుగ్గా వాడుతున్నారు..ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఉసిరికాయలకు కొందరు దూరంగా ఉండడమే మంచిది… మరి ఉసిరితో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఉసిరికాయలకు దూరంగా ఉండాలి. ఉసిరిని తీసుకున్నప్పుడు నోరు ఆరిపోయిన భావన కలుగుతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్ ఉన్నవారు తీసుకుంటే శరీరంపై మరింత ప్రభావం పడి సొమ్మగిల్లి పడిపోయే ప్రమాదం ఉంది…

ఈరోజుల్లో వయస్సుతో లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ బారిన పడుతున్నారు.. రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి. ఒక వేళ తీసుకున్నా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఉసిరి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని మరింతగా తగ్గిస్తుంది.. ఇకపోతే ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్నవారు కూడా ఉసిరికాయలను కనీసం వీటి జోలికి అస్సలు వెళ్లకండి..

అలాగే ఉసిరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అయితే అతిగా ఉసిరికాయలను తీసుకుంటే ఇందులోని విటమిన్ సి హైపర్ హైపర్ యాసిడిటీ సమస్యలను కలిగిస్తుంది… ఇంకా ఎన్నో మీకు తెలియనివి ఉన్నాయి.. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఆలోచించి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version