Site icon NTV Telugu

Diabetes Skin Symptoms: మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా?

Diabetes Skin Symptoms

Diabetes Skin Symptoms

Diabetes Skin Symptoms: ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇకపై ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితం కాదు, ఇప్పుడు ఈ వ్యాధి బారిన యువతరం కూడా పడుతోంది. డయాబెటిస్ అనేది చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. చాలా కాలం పాటు రక్తంలో ఎక్కువగా చక్కెర ఉన్నప్పుడు, చర్మం యొక్క సహజ రక్షణను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా చర్మ సమస్యలు వస్తాయి. మీ శరీరంపై ఇలాంటి మచ్చలు ఏమైనా ఉన్నాయి. ఆ మచ్చలు ఏంటి వాటి స్టోరీ ఏంటో చూద్దాం.

READ ALSO: Jammu Kashmir: కాశ్మీర్‌లో ‘ఉగ్ర’వేట.. ఏడుగురు సైనికులకు గాయాలు..

నిజానికి కొన్ని సందర్భాల్లో చర్మ మార్పులు క్రమంగా సంభవిస్తాయి. కాబట్టి చాలా మంది ప్రజలు మార్పులను లైట్‌ తీసుకొని పట్టించుకోవడం మానేస్తారు. అయితే చర్మంపై కనిపించే సంకేతాలు మధుమేహం యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. వివిధ చర్మ మార్పులకు డయాబెటిస్ కారణమవుతుందని వివరించారు. కొంత మందికి తరచుగా దురద లేదా మంట అనిపించవచ్చు. చర్మంపై ముఖ్యంగా మెడ, చంకలు లేదా తొడల చుట్టూ నల్లటి మచ్చలు కూడా డయాబెటిస్‌కు ఒక సంకేతం కావచ్చని పేర్కొన్నారు. చిన్నచిన్న గాయాలు నయం కావడానికి ఎక్కువ టైం పట్టడం మధుమేహం యొక్క ముఖ్య లక్షణంగా చెప్పవచ్చని తెలిపారు.

ఏం చేయాలంటే..
ఇలాంటి మార్పులను మీరు గమనిస్తే వెంటనే మీ రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు. అలాగే మీ భోజనంలో సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ వైద్యుడు సూచించిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. అలాగే ఎక్కువ రసాయనాలు ఉన్న ఉత్పత్తులను వాడకుండా, చర్మానికి అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవాలని చెప్పారు. ఏవైనా ఇన్ఫెక్షన్లు లేదా గాయాలు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

వీటిని ట్రై చేయండి..

ప్రతిరోజూ మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయండి.

తగినంత నీరు తాగాలి.

చర్మం పొడిగా ఉండనివ్వకండి.

ఏవైనా కొత్త చర్మ మార్పుల గుర్తిస్తే వైద్యుడిని సంప్రదించండి.

READ ALSO: Tejashwi Yadav: లాలూ వారసుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు.. ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు!

Exit mobile version