Chicken vs Mutton: ఈ రోజుల్లో డయాబెటిస్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి, అలాగే తినే ఆహారం విషయంలో కూడా కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి. షుగర్‌తో బాధపడే వారికి చికెన్ లేదా మటన్‌లలో ఏది తింటే మంచిది.. దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బ్లాస్ట్ షురూ అంటూ.. క్రేజీ పోస్టర్ రిలీజ్
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు మటన్‌ను పూర్తిగా మానేయాల్సిన పనిలేదని, దానిని మితంగా తీసుకుంటే సమస్య ఉండదని చెబుతున్నారు. నిజానికి మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుందని, ఇందులో జింక్, ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, అయినా కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు దీనిని తీసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని, ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని, అలాగే రెడ్ మీట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.
నిజానికి షుగర్ వ్యాధిగ్రస్తులకు మటన్‌తో పోలిస్తే చికెన్ మంచి ఎంపికని వైద్యనిపుణులు చెబుతున్నారు. చికెన్ మంచిదే కదా అని చికెన్ ఫ్రైలు, మసాలా దట్టించిన కర్రీలు తింటే ఫలితం రివర్స్ అవుతుందని వెల్లడించారు. చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటాయని, అలాగే ఇది తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవని, అలాగే ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుందని వివరించారు. అయితే చికెన్‌ను నూనెలో వేయించిన, నెయ్యి లేదా క్రీమ్ కలిపిన గ్రేవీలు చేసుకొని తిన్నా కూడా మంచివి కావని చెప్పారు. వాస్తవానికి ఉడికించిన చికెన్, గ్రిల్డ్ చికెన్ లేదా తక్కువ నూనెతో వండినది, స్కిన్‌లెస్ చికెన్ ఆరోగ్యానికి మంచిదని వెల్లడించారు. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి మటన్ కంటే చికెన్ మంచి ఎంపిక అని చెబుతున్నారు.
READ ALSO: EXclusive : విజయ్ దేవరకొండ ’14’ టైటిల్ ఇదే
