NTV Telugu Site icon

Ragi Java Benefits : రాగిజావతో ప్రయోజనాలెన్నో!

Ragi Java

Ragi Java

మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చిన్నప్పుడు రాగి, ఇతర తృణధాన్యాలు బాగా వినియోగించేవారు. అందుకే వారంతా బలంగా, ఆరోగ్యంగా జీవించేవారు. కానీ ఈ రోజుల్లో అలాంటి ఆహారం అంతగా తీసుకోవడం లేదు. గత కొన్నాళ్ళుగా తృణధాన్యాలు వాడకం పెరగడం అభినందనీయం. కేంద్రం కూడా ఈ ఏడాదిని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

* రాగి జావలో క్యాల్షియం (Calcium), పీచుపదార్థం (Fiber), మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక రాగి జావను తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే తీసుకునే ఆహారంపై కూడా దీని ప్రభావం పడి, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునేలా చేస్తుంది.

* రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. రాగులలో అమైనో ఆమ్లాలు (Amino acids) అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడ్డ చెడు కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఈ హార్మోన్లు (Hormones) శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, అధిక బరువును సులభంగా తగ్గిస్తాయని రుజువయింది.

*రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బీ విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

* రాగులను కొందరు దోశలా వేసుకుని తింటారు. అలా తిన్నా మంచిదే. అలాగే, ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి.

*రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రాగులను ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించడం ఆరోగ్యానికి శుభదాయకం.

* రాగుల్లో పీచు పదార్ధాలు అధికంగా ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది.

Read Also: CM Jagan Mohan Reddy: కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Show comments