Egg Nutrition Facts: చాలా మంది కోడి గుడ్లు రోజూ తినడం వల్ల ఊబకాయం వస్తుందని లేదా కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుంటారు. కానీ చాలా మంది అభిప్రాయానికి పూర్తి భిన్నంగా వాస్తవం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీరానికి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, సెలీనియం, అనేక ఇతర సూక్ష్మపోషకాలను అందించే ఆహారం అని వైద్యులు పేర్కొన్నారు. రోజుకు రెండు గుడ్లతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీ శక్తి మెరుగుపడటమే కాకుండా ఇంకా అనేక ఇతర సానుకూల అంశాలు కూడా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.
READ ALSO: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ముఖ్యంగా శీతాకాలంలో గుడ్లు తినడం చాలా అవసరమని, ఎందుకంటే ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడతాయని తెలిపారు. రోజూ గుడ్లు తినేవారిలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటుందని, అలాగే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం రెండు గుడ్లు తినడం వల్ల శరీరానికి అధిక-నాణ్యత, పూర్తి ప్రోటీన్ లభిస్తుందని, ఇందులో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఇది కండరాల మరమ్మతు, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారని అన్నారు.
గుడ్లలో విటమిన్లు ఎ, డి, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి విశేషంగా కృషి చేస్తాయని అన్నారు. శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల జలుబు, కాలానుగుణ అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వెల్లడించారు. ఇంకా వీటిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని చెప్పారు. అలాగే గుడ్లు బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతాయని అన్నారు. వీటితో పాటు గుడ్లు చర్మానికి, జుట్టుకు కూడా చాలా ముఖ్యమైనవిగా చెబుతున్నారు. గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ ఉంటుంది. దీంతో పాటు విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, మెరిసే చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయని వైద్యులు వెల్లడించారు. రోజూ రెండు గుడ్లు తినడం వల్ల జుట్టు రాలడం క్రమంగా తగ్గి, మెరిసే చర్మాన్ని సంతరించుకుంటారని తెలిపారు.
READ ALSO: Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్
