మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అయితే తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లని ఆహార పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తీపి రుచితో ఉన్నప్పటికీ అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
ప్రతి రోజు రాత్రి రెండు నల్ల అత్తి పండ్లను నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియను మెరుగుపరచి మొత్తం శరీరానికి శక్తి అందిస్తుంది.
నల్ల వెల్లులి రుచిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారం. ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అదనంగా, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ B6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం, నాడీ వ్యవస్థ పనితీరు, శక్తిసామర్థ్యం మెరుగుపడతాయి.
ఎండుద్రాక్షల్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ C వంటి అనేక పోషకాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషియన్స్. ఇవి గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు,ఎముకల బలం పెంచేందుకు, జీర్ణక్రియ మెరుగుపడేందుకు,జుట్టు–చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి. అదనంగా, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మనం తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ బ్లాక్ రైస్ (నల్ల బియ్యం) అత్యంత పోషక విలువ కలిగిన ధాన్యం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని న్యూట్రిషన్లు చెబుతున్నారు.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది.మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వీటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా న్యూట్రిషన్ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.
