NTV Telugu Site icon

Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..

Rice Water

Rice Water

Rice Water: చాలా మంది బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. కానీ బియ్యం కడిగిన నీటిని పారేయడం కంటే వాటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. బియ్యం కడిగిన నీటిలో చాలా పోషకాలు ఉన్నాయని, ముఖ్యంగా బి విటమిన్, ఇ విటమిన్, భాస్వరం, పొటాషియం మరియు తక్కువ మొత్తంలో గంజి ఉంటాయని చెప్పారు. బియ్యం కడిగిన నీటిని వాడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, జుట్టుకు కూడా మంచిదని చెబుతారు. మనకు ప్రధాన ఆహారం అయిన అన్నం వండడానికి బియ్యం కడిగినప్పుడు, సహజంగా కడిగిన నీటిని పారేస్తాము.

 

బియ్యం కడిగిన నీరు మన జుట్టు ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మన జుట్టు సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేస్తే అందులోని పోషకాలు మన వెంట్రుకల కుదుళ్లలోకి చేరుతాయి. ఇది జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యం కడిగే నీటిలో ఇనోసిటాల్, ఫైటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. రైస్ వాటర్ చర్మానికి చాలా మేలు చేయడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుతుంది, తేమను అందిస్తుంది, ముఖంపై మంటను తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే, అది మన జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తిని నివారిస్తుంది.

బియ్యం కడిగిన నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం కడిగిన నీరు గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. పూర్వం అన్నం వండేటప్పుడు గంజి పోసి గంజి తాగేవారు. గంజిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Govinda Feeling Unwell : ప్రముఖ బాలీవుడ్ నటుడికి అస్వస్థత