Site icon NTV Telugu

Health Tips : పసుపు, తేనె కలిపి తీసుకుంటే..ఎన్ని లాభాలో తెలుసా !

Health Tips,turmeric And Honey

Health Tips,turmeric And Honey

ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో వండుకుని తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది. సంపాదించడంలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. చాలా మంది ఆయుర్వేద విధానాలను ఫాలో అవుతున్నారు. ఇంట్లో లభించే సహజ చిట్కాలు పాటిస్తున్నారు. అయితే పసుపు, తేనె ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read : Keerthi Suresh : బాలీవడ్‌లో మరో ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్..

ప‌సుపు, తేనె మిశ్రమం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మిశ్రమం స‌హ‌జ‌సిద్ధమైన లాక్సేటివ్ ఏజెంట్‌గా పనిచేస్తుందట. ఇది సుఖ విరోచనానికి దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలైనా కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. పసుపు తేనెలో విటమిన్‌ ఏ ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి, క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. ప‌సుపు, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్షన్లు సైతం త‌గ్గుతాయి. అలాగే సీజనల్‌ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉపశమనం కల్పించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఒక గ్లాస్ వాటర్‌లో తగినంత పసుపు , తేనె కలిపి తాగాలి. ఈ మిశ్రమం చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరిచి ప్రకాశవంతంగా చేస్తుంది. లోపల నుంచి జరిగే డీటాక్సిఫికేషన్‌ వల్ల ముడతలు, మొటిమలు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ కషాయంలో జీవక్రియ వేగాన్ని పెంచే గుణం ఉంది. ఆకలి నియంత్రణలో ఉంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు, తేనె వేర్వేరుగా ఒకదానికొకటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాటిని కలిపి తీసుకున్నప్పుడు అది శరీరానికి రెండు రెట్లు లాభం చేస్తుంది. ప్రతి రోజు ఉదయం దీన్ని తీసుకునే అలవాటు చేసుకుంటే.. కేవలం 15 రోజుల్లోనే మీ శరీరంలో తేడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version