NTV Telugu Site icon

Headache: తలనొప్పితో భరించలేకపోతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

Head Ache

Head Ache

కొన్నిసార్లు నిద్ర లేకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా కొంతమందికి విపరీతమైన తల నొప్పి వస్తుంది..ఇలా ఎక్కువగా తల నొప్పి వస్తుంటే అది జన్యుపరమైన తలనొప్పిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా అవుతాయి. అయితే తలనొప్పికి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా.. ప్రమాదం ఉందండోయ్. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి తలనొప్పిగా అనిపిస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగడం ఉత్తమం. గంధాన్ని నుదుటిపై రాసినా ఉపశమనం పొందవచ్చు.. తలనొప్పి ఎక్కువగా ఉంటే గోరు వెచ్చని నీళ్లతో తల స్నానం చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. తలకు నూనె రాసి ఆముదం ఆకు లేదా తమలపాకులను తల మీద పెట్టుకున్న వెంటనే ఉపశమనం కలుగుతుంది.. అలాగే జెండు బామ్ ను నుదుటికి రాసి వాటిపై తమలపాకులను పెట్టినా వెంటనే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది..

పంటినొప్పి, కంటి నొప్పి ఉన్నా కూడా అది తలనొప్పికి దారి తీస్తుంది. ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని.. బ్రీథింగ్ వర్కౌట్స్ అంటే యోగా లాంటివి చేసినా కూడా చాలా మంచిది. ఇది తలకు ఆక్సిజన్ ని అందించి సహాయం చేస్తోంది.. మెదడుకి సంబంధించిన నరాలు చెవి ప్రాంతాన్ని కలిపి ఉంటాయి. చెవి వెనుక భాగంలో కాస్త మస్తాజ్ చేసి, కిందికి పైకి కొద్దిగా లాగడం మంచిది. నుదురు, తలపై మసాజ్ చేసుకోవడం, నాసికా రంధ్రాలపై నుంచి కింది భాగం వరకు నుదుటి పై కూడా ఐస్ ముక్కలతో నెమ్మదిగా మసాజ్ చేసిన వెంటనే తల నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది..

Show comments