Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబం అనే నావను కంటికి రెప్పలా కాపాడుతూ, సుడిగుండాలెన్ని ఎదురైనా ఒడ్డుకు చేర్చే లంగరు ‘నాన్న’. సమాజంలో అమ్మ ప్రేమ గురించి మాట్లాడినంతగా నాన్న త్యాగాల గురించి చర్చ జరగదు. ఎందుకంటే.. నాన్న తన ప్రేమనైనా, బాధనైనా పైకి చూపించడు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ‘ఫాదర్స్ డే’ సందర్భంగా, మనకోసం అహర్నిశలు శ్రమించే నాన్నలందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే ఒక మంచి సందర్భం ఇది.
కుటుంబ భారం మోసే కర్మయోగి..
సూర్యుడు ఉదయించక ముందే నాన్న బాధ్యత మొదలవుతుంది. తన అలసటను, అనారోగ్యాన్ని పక్కనపెట్టి ప్రతిరోజూ ఆఫీసుకో, పొలానికో, లేదా తను చేసే పనిలోకి పరుగు తీస్తాడు. దానికి కారణం ఇంట్లో పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, రేపటి భవిష్యత్తు. మనకు నచ్చిన బట్టలు, బొమ్మలు, బైకులు కొనివ్వడానికి వెనకాడడు. కానీ, తను మాత్రం ఏళ్ల తరబడి చిరిగిన పాత చొక్కాతోనే కాలం వెళ్లదీస్తాడు. తన వ్యక్తిగత సుఖాలను, సంతోషాలను పిల్లల నవ్వుల్లో వెతుక్కునే నిస్వార్థ జీవి నాన్న.
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
అందరి బాధ్యతలను మోసే రక్షకుడు..
ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ‘నేనున్నానంటూ’ ముందుండే ధైర్యం నాన్న. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ నీడ పిల్లలపై పడకుండా కోటగోడలా నిలబడతాడు. సమాజంలో పిల్లలు తలెత్తుకుని బతికేలా క్రమశిక్షణను, విలువలను నేర్పుతాడు. అమ్మ నడక నేర్పితే, ఆ నడకలో పడిపోకుండా ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో నాన్న నేర్పుతాడు.
వయసు పైబడిన తర్వాత కూడా పిల్లల పెళ్లిళ్లు, వారి స్థిరపడటం గురించే ఆలోచిస్తూ నిరంతరం తపించే నాన్నకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి ఆయనను గౌరవించడం, ప్రేమగా చూసుకోవడం.
హృదయాన్ని కదిలించే ‘నాన్న’ కొటేషన్స్ మీ కోసం..
“తన అరిగిపోయిన చెప్పుల సాక్షిగా… మనకు బంగారు భవిష్యత్తును రాసిచ్చే అక్షర శిల్పి… నాన్న!”
“కన్నీళ్లను గుండెల్లో దాచి, కష్టాలను నవ్వుతో ఓర్చి, పిల్లల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించే నిజమైన హీరో… నాన్న!”
“అమ్మ మనల్ని నవమాసాలు మోస్తే… నాన్న మనల్ని జీవితాంతం తన బాధ్యతగా మోస్తాడు.”
“నువ్వు కోరుకున్నవన్నీ కొనివ్వడానికి… తన అవసరాలను వాయిదా వేసుకునే ఒకే ఒక్క నిస్వార్థ జీవి… నాన్న!”
“ప్రపంచంలో తండ్రి కంటే మిన్న అయిన ధైర్యం లేదు, ఆయన ఇచ్చే భరోసా కంటే గొప్ప ఆస్తి మరొకటి లేదు.” “ఆకాశమంత కోపం ఉన్నా… అంతకంటే ఎక్కువే సముద్రమంత ప్రేముండే
మమకారాల నిలయం… నాన్న!”
నాన్న వ్యక్తిగా కాకుండా.. ఒక వ్యవస్థలా ఉంటాడు. ఈ ఫాదర్స్ డే రోజున నాన్నకు కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాదు… ఆయన దగ్గరకు వెళ్లి “నాన్న, నువ్వు మాకు ఉన్నావు అనే ధైర్యమే మమ్మల్ని నడిపిస్తోంది” అని ఒక్క మాట చెప్పండి. ఆ మాట ఆయన పడే కష్టాన్నంతటినీ ఒక్క క్షణంలో మాయం చేస్తుంది. ప్రపంచంలోని నాన్నలందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!