Site icon NTV Telugu

Health Tips: ఈ పని చేస్తే మీ జుట్టు రాలదు..

Hair Fall

Hair Fall

Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. వాస్తవానికి ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు కానీ, చాలా సాధారణమైన కారణాలు కొన్ని ఉన్నాయి. నిజానికి ఈ స్టోరీ చర్చించబోయే పని చేస్తే మీరు మీ జట్టును రక్షించుకోవడంలో విజయవంతం అవుతారు. ఇంతకీ ఎలా మీరు మీ జట్టును రక్షించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించండి..

ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ.. జట్టు రాలడానికి ప్రధాన సమస్యలలో.. అధిక మానసిక ఒత్తిడి, పోషక లోపాలు (ఐరన్, ప్రోటీన్ వంటివి), జన్యు పరమైన సమస్యలు అని అన్నారు. అలాగే వాతావరణ కాలుష్యం, జుట్టుకు అధికంగా రసాయనాలను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు మూలాలు బలహీనపడతాయని వెల్లడించారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సమస్య సాధారణ జుట్టు రాలడం కంటే బట్టతల వరకు పెరుగుతుందని హెచ్చరించారు.

ఈ సమస్యను ఎదుర్కోవడానికి, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం అని అన్నారు. జుట్టుకు తగినంత పోషణ అందించడానికి మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోవాలని సూచించారు. అలాగే వారానికి కనీసం రెండుసార్లు తలకు నూనెతో మసాజ్ చేయాలని, తగినంత నిద్ర పోవాలని చెప్పారు. జుట్టు రాలడం తీవ్రంగా వేధిస్తుంటే కచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలని పేర్కొన్నారు.

ఈ చిట్కాలను ట్రై చేయండి..

* గుడ్డు : జుట్టు పెరుగుదలను పెంచే ప్రోటీన్‌కు గుడ్లు అద్భుతంగా పని చేస్తుంది.

* ఉసిరి: జుట్టు పెరుగుదలను పెంచే వాటిలో రెండవది ఉసిరి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి.

* బీట్‌రూట్: మూడవ బీట్‌రూట్. ఇందులో నైట్రేట్లు ఉంటాయి, ఇవి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, అలాగే తలకు పోషణను అందిస్తుంది.

* మీ ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ శరీరానికి ఇనుమును అందించే వాటిలో ముందు వరుసలో ఉంటుంది. ఇనుము ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. ఇది జట్టు వేర్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.

* చిలగడదుంప: జట్టు పెరుగుదలను మెరుగుపరిచే ఆహారంలో చిలగడదుంపలు కూడా ఉన్నాయి. వీటిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి నిస్తేజమైన జుట్టుకు మెరుపును ఇస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

* పెరుగు : మీ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి. ఎందుకంటే పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుందని వెల్లడించారు. ఈ పదార్థాలు జట్టు ఆరోగ్యం, తల చర్మాన్ని మెరుగు పరుస్తాయని చెప్పారు.

READ ALSO: Gmail Address: గూగుల్ కొత్త ఫీచర్ విడుదల.. Gmail అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?

Exit mobile version