ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యం పై ఆసక్తి పెరిగింది.. దాంతో చాలా మంది గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్ టీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.. శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేస్తుంది.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అయితే, మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా? ఎక్కువగా తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ గ్రీన్ టీని రోజులో 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీని అంత పరిమాణంలో తాగడం వల్ల దాని ప్రయోజనాలను పొందుతాము. ఎటువంటి హాని ఉండదు. గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి. గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన హృదయాన్ని బలపరుస్తుంది. మన బరువును నియంత్రిస్తుంది. మనకు తాజా అనుభూతిని కలిగిస్తుంది.. అలాగని ఎక్కువ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..
ఈ గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే గ్రీన్ టీ ఎసిడిటీని పెంచుతుంది.. అలాగే ఐరన్ శోషణను తగ్గించే టానిన్లు కూడా ఉన్నాయి. అంటే మనం ఆహారంతో పాటు గ్రీన్ టీని ఎక్కువగా తాగితే, లేదంటే ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగటం వల్ల మన శరీరం ఆహారం నుండి ఇనుమును సరిగ్గా పొందలేము.. దాంతో రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది.. ఈ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. మనం ఎక్కువగా గ్రీన్ టీ తాగితే, మన శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా, నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఆరోగ్యం కదా అని ఎక్కువగా తాగితే ఇక అంతే.. అందుకే ఏదైనా లిమిట్ గానే తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.