Site icon NTV Telugu

Dimpleplasty: సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి.. ఎంత పని చేసిందో తెలుసా..

Untitled Design (17)

Untitled Design (17)

సాధారణంగా సొట్ట బుగ్గలున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తుంటారు. ఈ సొట్ట బుగ్గలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు నవ్వినపుడు.. చెంపలు లోపలికి వెళ్లి ఓ గుంతలా కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి సొగ్గ బుగ్గలకు సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Pea Nuts: వేరు శెనగ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..

కొంతమందికి సహజంగానే బుగ్గలపై సొట్ట ఉంటుంది. వాళ్లు నవ్వినప్పుడు బుగ్గపై సొట్టలతో మరింత అందంగా కనిపిస్తారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రీతాజింటాను సొట్ట బుగ్గల సుందరి అంటారు. అలాగే మన తెలుగు నటుడు మంచు మనోజ్‌కు కూడా సొట్ట బుగ్గలు ఉన్నాయి. వారి అవి సహజంగా వచ్చాయి. కానీ సొట్ట బుగ్గల కోసం ఓ అమ్మాయి చేసుకున్న డింపుల్ప్లాస్టీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సహజంగా లేని సొట్ట బుగ్గలు లేని వారు ఈ ఆర్టిఫిషియల్ సొట్ట బుగ్గలను సృష్టించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధిచిన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డింపుల్ప్లాస్టీ సురక్షితమైనదిగా పరిగణించినా, దాని వల్ల వచ్చే ప్రమాదాలు గుర్తించకుండా.. అందకోసం ఇంతటి రిస్క్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Murder: దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య

అయితే ఓ అమ్మాయి సొట్ట బుగ్గలు వచ్చేందుకు తన చెంపపై ఒక గుంటను తయారు చేశారు. శస్త్రచికిత్స ద్వారా లేదా సన్నని తీగ సహాయంతో ఆమె నోటి లోపల ఆ గుంటను సృష్టించారు. కానీ అది చూసిన వారెవరూ.. దానిని క్రియేట్ చేసినదని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ అమ్మాయి నవ్వినపుడు ఆమె బుగ్గలో చిన్న సొట్ట కనిపిస్తుంది. డింపుల్ప్లాస్టీ అని పిలువబడే ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగా ఉంటుందని సమాచారం. అయినా కూడా సొట్ట బుగ్గల కోసం ఇంత రిస్క్‌ అవసరమా అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.

Exit mobile version