NTV Telugu Site icon

Gastric Problem: చలికాలంలో గ్యాస్ ఎక్కువగా పడుతుందా? ఈ డ్రింక్ ను ఉదయాన్నే తాగారంటే..

Gass (2)

Gass (2)

చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. అందులో జీర్ణ సమస్యలు ఎక్కువగా రావడంతో గ్యాస్ పడుతుంది.. ఇలా చాలా మంది ప్రతి రోజూ భాధ పడుతుంటారు.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ డ్రింక్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు.. ఆ డ్రింక్ ఏంటో, ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ కాలంలో ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.. టైం కు తినడం కూడా చెయ్యాలి.. తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు అటు ఇటు కాసేపు వాక్ చెయ్యాలి.. ఇక చలికాలంలో రోజుకు కనీసం 2 అరటిపండ్లు తినాలి. అరటిపండ్లు తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కడుపు శుభ్రంగా ఉంటే, జీర్ణ సమస్య ఉండదు. అంతే కాకుండా పాలు తాగడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఈ పాలు పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుంది..

దాల్చిన చెక్క జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. ఇది జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది. ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.. ఇకపోతే రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సోంపు వేసి బాగా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి.. అలాగే జీలకర్ర నానబెట్టిన నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.