Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
- చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి?
- వాస్తు శాస్త్రంలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: ఇంట్లో పెట్టే ఫోటోలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు, అవి మన జ్ఞాపకాలు, మన సంబంధాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మరణించిన వారి ఫోటోలను ఇళ్లలో ఉంచడం మనం చూస్తుంటాం. ‘‘పితృ దేవతలు’’గా పలిచే మన ఇంటి పెద్దల ఫోటోలు ఎక్కడ ఉంచాలనే సందేహాలు తరుచుగా వస్తుంటాయి. హిందూ సంప్రదాయం, వాస్తు శాస్త్రాల ప్రకారం పితృదేవతల ఫోటోల స్థానం ఇంట్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం, మరణించిన కుటుంబ సభ్యుల ఫోటోలు ఇంటి దక్షిణ దిశ లేదా పడమర గోడపై ఉంచడం మంచిదని భావిస్తారు. ఈ దిశాలు పితృదేవతలతో అనుబంధం కలిగివ ఉంటాయని సంప్రదాయ విశ్వాసం. ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖం తూర్పు వైపు కనిపించేలా ఉండటం మంచిది.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ఇదే సమయంలో పితృదేవతల ఫోటోలు దేవుళ్ల ఫోటోలతో కలిపి పూజా గదిలో ఉంచకూడదు. పూర్వీకుల్ని స్మరించుకుంటాం, గౌరవించుకుంటాం. దేవతల్ని పూజిస్తాం. అందుకే చనిపోయిన వారి ఫోటోలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. వంట గదిలో ఫోటోలు పెట్టకూడదు. వంటగది ఆహారం, శక్తి, రోజూవారీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. ప్రశాంతంగా పెద్ద వారిని తలుచుకునే ప్రదేశం కాదు. మెట్ల వద్ద, హాలులో, ఎక్కువ మంది రాకపోకలు సాగించే ప్రదేశాల్ ఉంచొద్దు. జీవించి ఉన్న వారి ఫోటోలు, మరణించిన వ్యక్తుల ఫోటోలతో కలిపి ఉంచొద్దు.
గరుడ పురాణం అనేది మరణానంతర జీవితం, పితృ కర్మలు, శ్రాద్ధ కర్మల్ని గురించి తెలుపుతుంది. మరణించిన వారి ఫోటోలకు సంబంధించిన వివరాలను ప్రత్యేకం ప్రస్తావించదు. చాలా మంది గరుడ పురాణాన్ని ప్రస్తావిస్తూ, చనిపోయిన వారి ఫోటోలు అక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు అని చెబుతుంటారు. కానీ గరుడ పురాణంలో ఇలాంటివి ఏం చెప్పబడలేదు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!