Garlic Chicken Curry :గార్లిక్ చికెన్ కర్రీని ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం.. చికెన్ తో చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది.. అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉండేలా గార్లిక్ చికెన్ ను ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. నాన్, రోటీ, వంటి వాటితో తినడానికి ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ కర్రీని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం పదండి..
కావలసిన పదార్థాలు :
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
నూనె – 4 టేబుల్ స్పూన్స్,
చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1,
కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10,
కారం -ఒక టీ స్పూన్,
మిరియాల పొడి – అర టీ స్పూన్,
టమాట కిచప్ – 2 టేబుల్ స్పూన్స్,
ఉప్పు – తగినంత,
గరం మసాలా – ఒకటిన్నర టీ స్పూన్,
కసూరి మెంతి -ఒక టీ స్పూన్,
నీళ్లు – అర గ్లాస్..
చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి..
తయారీ విధానం :
ముందుగా చికెన్ ను కాస్త పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి..ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే కారం, మిరియాల పొడి వేసి కలపాలి..టమోటా కిచప్ వేసి బాగా కలపాలి.. ఒక్క నిమిషం తర్వాత చికెన్ మిశ్రమాన్ని వేసి కలపాలి..ఆ తర్వాత గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి..ఇక స్టవ్ చిన్న మంటపై మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కసూరి మెంతి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించిస్టవ్ ఆఫ్ చేసుకోవాలి… అంతే ఘుమ ఘుమలాడే గార్లిక్ చికెన్ కర్రీ రెడీ.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!