Bloating After Eating: సాధారణంగా చాలా మందికి ఒక సమస్య కామన్‌గా వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారు. కడుపు ఉబ్బరం. భోజనం చేసిన తర్వాత చాలా మందిని వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్లో ఉబ్బరం, బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల నియమాల గురించి పంచుకున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pawan Kalyan: గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే..
కివీ: ఫైబర్ అధికంగా ఉండే కివీస్లో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి విశేషంగా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు కివీలు తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందన చెప్పారు.
సోంపు: భోజనం తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడానికి సోంపును చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. UK ఆరోగ్య సంస్థ NIH అధ్యయనం ప్రకారం.. సోంపు నూనె ఉబ్బరం, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) తో సంబంధం ఉన్న గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్చిన్నం చేయడంలో సహాయపడటంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో బొప్పాయి తినడం వల్ల మీ కడుపు తేలికగా అనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అనాస పండు: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడటంతో పాటు వాపును తగ్గిస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో తాజా పైనాపిల్ తినడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ: దోసకాయలు నీరు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో నీరు నిలుపుదల, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని సలాడ్ లేదా స్నాక్‌గా తినవచ్చని చెబుతున్నారు.
READ ALSO: Honey In Hot Water: హాట్ వాటర్‌లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
