Ulavacharu: బరువు తగ్గాలా? కిడ్నీ స్టోన్స్, డయాబెటిస్‌కు చెక్ పెట్టే హెల్తీ & సింపుల్ “ఉలవ కట్టు”.. ఇలా చేస్తే ఆరోగ్యమే ఆరోగ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ulavacharu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేక చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండటానికి కారణం వారు తీసుకునే ప్రకృతి సిద్ధమైన ఆహారమే. అలాంటి హెల్తీ, సింపుల్ వంటకాల్లో ‘ఉలవ కట్టు చారు’ ఒకటి. శరీరంలోని మలినాలను బయటకు పంపడమే కాకుండా, మొండిగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి (Weight Loss) ఇది అద్భుతంగా పని చేస్తుంది. కేవలం వెయిట్ లాస్ మాత్రమే కాదు.. రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ, ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడకుండా చూడటంలో ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సైతం అవి క్రమంగా తగ్గడానికి ఈ ఉలవ కట్టు ఎంతో సహాయపడుతుంది. ఇంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సింపుల్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Mule Bank Accounts : హైదరాబాద్ లో సైబర్ మోసాలపై భారీ ఆపరేషన్.. వేల ఖాతాలు చెక్..!
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
కమ్మని ఉలవ కట్టు చారుకు కావలసిన పదార్థాలు..
ఉలవలు – పావు కప్పు
చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజు (25 గ్రాములు)
ధనియాలు – 2 టీస్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, మెంతులు – అర టీస్పూన్
ఎండుమిర్చి – 4 నుంచి 5
ఎండు కొబ్బరి ముక్కలు – 3 ఇంచులు
అల్లం – ఒక ఇంచు, వెల్లుల్లి రెబ్బలు – 4
పోపు కోసం: ఆయిల్, మినప్పప్పు, ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు, ఇంగువ
బెల్లం – ఒక టీస్పూన్, కొత్తిమీర
తయారీ విధానం..
ముందుగా బాండీలో పావు కప్పు ఉలవలు వేసి సన్నటి సెగ మీద దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు చింతపండు రసం తీసుకుని, అందులో మూడు కప్పుల నీళ్లు (సుమారు ఒక లీటర్) కలపాలి. ఇందులో మనం తయారు చేసుకున్న ఉలవ పొడిని ఉండలు లేకుండా కలిపి, తగినంత ఉప్పు వేసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసి మసాలా ముద్దను సిద్ధం చేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిగా ఇంగువ వేసి, మనం సిద్ధం చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఇందులో పసుపు, ముందుగా కలిపి పెట్టుకున్న ఉలవ పొడి-చింతపండు రసాన్ని పోయాలి. కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసి, రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఒక టీస్పూన్ బెల్లం కలపాలి. ఈ చారును సన్నటి సెగ మీద కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి.
ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఉలవల్లో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. అవి శరీరానికి ఎలా మేలు చేస్తాయంటే.. ఈ ఉలవ చారు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది, రాళ్లు ఉన్నవారికి అవి తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి బాడీని శుద్ధి చేస్తుంది. ఈ ఉలవ కట్టు వేడి మీద కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది. ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన ఉలవ కట్టును మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ప్రయత్నించి, ఆ కమ్మని రుచిని ఆస్వాదించండి.
READ ALSO: Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!